బద్వేలు రెవెన్యూ డివిజన్ ప్రజలందరికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
బద్వేలు ఆర్డీవో ఆకుల వెంకటరమణ
సిరా న్యూస్,బద్వేలు;
భారతదేశం సర్వసత్తాక, సౌమ్యవాద,లౌకిక, ప్రజాస్వామ్య,గణతంత్ర రాజ్యంగా అవతరించిన రోజు జనవరి 26,1950. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్చ,సమానత్వం,లౌకికతత్వం,న్యాయాన్ని పూర్తి స్ధాయిలో ఒక హక్కుగా పొందారని బద్వేలు ఆర్డిఓ ఆకుల వెంకటరమణ అన్నారు శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డిఓ ఆకుల వెంకటరమణ
జాతీయ పతాకం ఎగురవేసి గౌరవ వందనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం ఎట్లనో గణతంత్రం కూడా అలాగే అని అన్నారు ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రజాస్వామ్యం పౌర హక్కులు మన దేశానికి ఉన్నాయని ఇది జాతి గర్వించదగ్గ విషయమని తెలిపారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ పూర్తిగా తీసుకొని ఆయన మార్గంలో నడవాలని కోరారు దేశ స్వాతంత్రం కోసం స్వాతంత్ర యోధులు ఎంతగా పోరాడారు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అందరికీ తెలిసిన విషయమే అన్నారు భారతదేశానికి గణతంత్రం ఒక పండుగ లాంటిదని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ మహనీయుల ఆదర్శాలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడవాలని ఆర్డిఓ కోరారు ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయంటే అది మన దేశం ఘనత అని పేర్కొన్నారు ఎన్నో రంగాలకు కలలకు కానాచి అయినా భారతదేశం ఎంతో ప్రగతి సాధించి ముందుకు నడుస్తున్నట్టు తెలిపారు మనదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం మరి ఎక్కడ లేదన్నారు విద్యార్థులు యువకులు యువతులు చిన్నారులు చిన్నప్పటినుంచి రాజ్యాంగ స్ఫూర్తి అలవర్చుకోవాలని కోరారు ఇంకా పలు విషయాల గురించి ఆర్డీవో మాట్లాడారు కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు