ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకొని అధిక దిగుబడి పొందాలి

కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు ..
సిరా న్యూస్,కమాన్ పూర్;
కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరి ఖిల్లా మరియు వ్యవసాయ శాఖ సంయుక్త సహకారంతో ప్రపంచ నేల దినోత్సవం అనే కార్యక్రమంను పెద్దపెల్లి జిల్లాలోని కమాన్ పూర్ మండలం గుండారం గ్రామం లోని రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమం కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన గ్రామ సర్పంచ్ ఆకుల ఓదెల  నేల పరిరక్షణ గురించి ప్రసంగించారు. రైతులు పంట భూముల్లో మోతాదుకు మించి విపరీతమైన రసాయనిక ఎరువులను
వాడడం వల్ల ఆ నెలలో పండే పంటలు విషపూరీతంగా మారుతున్నాయన్నారు.
ఇప్పుడు మనం తింటున్న ఆహార పదార్థాలు అన్ని కూడ కలుషితమేననిఆవేదన వ్యక్తం చేశారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ శ్రీనివాస్  మాట్లాడుతూ భూమికి ఎక్కువగా రసాయనిక ఎరువులకు బదులుగాసేంద్రియ ఎరువులను వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు.
సేంద్రియ వ్యవసాయ సాగు వల్ల ఆరోగ్యాకరమైన ఆహారాన్ని ప్రజలకు అందించే దిశగా రైతాంగం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. డాక్టర్ కిరణ్ పిల్లి, మృత్తిక శాస్త్రవేత్త

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *