వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరు బయోమెట్రిక్ ఇవ్వాలి

– బయోమెట్రిక్ అప్డేట్ అనేది నిరంతర ప్రకీయ అని గ్యాస్ ఏజెన్సీల వర్గాలు వెల్లడి

– గ్యాస్ కనెక్షన్ వినియోగదరులు ఆందోళన చెదనవసరం లేదని పరవాడ అపన గ్యాస్ ఏజెన్సీ వెల్లడి

సిరా న్యూస్,పరవాడ;
ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో ఒక గ్యాస్ సిలిండర్ ఉంటుంది. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి.. ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద గతంలో గ్యాస్ సిలిండర్‌పై రూ. 200 సబ్సిడీ ఇచ్చేవారు. తర్వాత ఇది రూ. 300కు పెరిగింది. అంటే రెగ్యులర్ సిలిండర్ల కంటే రూ. 300 తక్కువతో గ్యాస్ సిలిండర్ పొందొచ్చు. అయితే ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలా సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పొందాలంటే.. కచ్చితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేసి ఉండాలి. అంటే గ్యాస్ కనెక్షన్ తీసుకున్న ఆఫీసుల వద్ద వినియోగదారులు కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆయిల్ కంపెనీలు కొంత సమయంఇచ్చి ఈ ప్రాసెస్ పూర్తి చేయాలని పేర్కొన్నాయి.వంటగ్యాస్‌పై సబ్సిడీ కొనసాగించాలనుకునేవారు బయోమెట్రిక్ చేసుకోవాలి. గతంలో డిసెంబర్ 31 లాస్ట్ డేట్ అనే మాట వినిపించింది. దీంతో అప్పుడే గ్యాస్ ఏజెన్సీల దగ్గర జనం క్యూ కట్టారు. తర్వాత ఇంకా గడువు ఉందని తెలిసిందే.పలు రిపోర్ట్స్ ప్రకారం.. సగటున 50-70 శాతం వరకు కస్టమర్లు బయోమెట్రిక్ అప్డేట్ చేస్కున్నారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు కంపెనీలు కస్టమర్స్ తొందరగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేశాయి. దీనిని ఏజెన్సీల దగ్గరికి వెళ్లి ఆఫ్‌లైన్‌లో లేదా మొబైల్‌లో ఆన్‌లైన్‌లోనే చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దీని కోసం భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వంటివి కొత్త యాప్స్ కూడా తీసుకొచ్చాయి.గత సారి మాదిరిగానే ఈసారి కూడా బయోమెట్రిక్ అప్‌డేట్‌కు గడువు విధించిన తర్వాత ఈ లోపు బయోమెట్రిక్‌ను అప్‌డేట్ చేయకపోతే గ్యాస్ కనెక్షన్‌ను డిస్‌కనెక్ట్ చేస్తారా అనే ప్రశ్న వినియోగదారుల మదిలో మెదులుతోంది. బయోమెట్రిక్ అప్‌డేట్ చేయకపోతే గ్యాస్ సబ్సిడీ ఆగిపోతుందా? ఈ విషయంపై ఇంకా స్పష్టమైన సమాధానం లేనప్పటికీ,బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయకపోతే ఎల్‌పిజి గ్యాస్ సబ్సిడీని నిలిపివేయాలని లేదా డిస్‌కనెక్షన్ నిలిపివేయాలని కేంద్రం ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని చమురు కంపెనీల వర్గాలు తెలిపాయి.

గత నాలుగు రోజులు నుంచి మండల కేంద్రము అయ్యిన పరవాడలో ఉన్న పరవాడ అపన గ్యాస్ ఏజెన్సీ వినియోగదరులు బయోమెట్రిక్ అప్డేట్కి జిల్లా లోని అపన గ్యాస్ ఏజెన్సీ వినియోగదరులు అందరూ ఒకే సారి వస్తూ ఉండడంతో ఏజెన్సీ ఆఫీస్ దగ్గర గంధరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై అపన గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు బయోమెట్రిక్ అప్డేట్కి ఎవ్వరు ఆందోళన చెదనవసరం లేదు అని బయోమెట్రిక్ అప్డేట్కి ఇంకా సమయం ఉంది అని ఈ విషయాన్ని వంట గ్యాస్ కనెక్షన్ ఉన్న ప్రతి ఒక్కరు గమనించాలని ఏజెన్సీ సిబ్బంది తెలియజేసారు.
======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *