సిరా న్యూస్,కమాన్ పూర్;
అందరికీ అభిమానమైన వ్యక్తి సీనియర్ జర్నలిస్ట్ జబ్బార్ ఖాన్ అని సీనియర్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ నాయకుడు కన్నాల వాస్తవ్యుడు ఖాలిక్ అన్నారు. జబ్బర్ ఖాన్ కు ఇటీవలే ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పులిపాక దేవా ఆధ్వర్యంలో నిర్వహించిన బిట్ బిట్ అకాడమీ వారు 2024 ఉత్తమ విలేకరిగా ఎంపిక చేసి అవార్డును అందజేశారు. దీంతో గుండారం గ్రామంలో పాలకుర్తి మండలం కన్నాల గ్రామం చెందిన మైనార్టీలు జబ్బార్ ఖాన్ ను పూలమాల వేసి స్వీట్ తినిపించి షాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఖాళిక్ మాట్లాడుతూ జబ్బార్ ఖాన్ ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధం ఉందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు తీసుకోవాలని 30 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో అందరికీ కలుపుగోలుగా ఉండే వ్యక్తి జబ్బార్ ఖాన్ అని అన్నారు. ప్రేమతో పిలిచే జబ్బర్ ఖాన్ ప్రజలకు మరింత సేవ చేయాలని ఖలిక్ అన్నారు. ఈ కార్యక్రమంలో బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ మాజీ ప్రధాన కార్యదర్శి ఫయాజ్ సాబీర్ భాష మైనార్టీ కాంగ్రెస్ నాయకుడు డిష్ ఖదీర్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.