సిరా న్యూస్,ముంబై;
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఆ జోష్ మామూలుగా ఉండదు. తాగేవాళ్లు తాగుతారు. ఊగేవాళ్లు ఊగుతారు. నచ్చినట్టుగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక్కో చోట ఒక్కో విధంగా వేడుకలు చేసుకున్నప్పటికీ ఆ జోరులో ఏ తేడా ఉండదు. విదేశాల్లో అయితే నెల రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. పైగా క్రిస్మస్ సందడి కూడా తోడవుతుంది. ఈ ఉత్సాహంలో అసలు ఎంత ఖర్చు పెడుతున్నామో ఆలోచించరు. ఇంట్లో డెకరేషన్స్ నుంచి క్రాకర్స్, కేక్‌లు, స్నాక్స్, డ్రింక్స్..వగైరా వగైరా వాటి కోసం బోలెడంత స్పెండ్ చేసేస్తారు. లెక్కల సంగతి తరవాత బ్రో…ఇప్పుడు ఎంజాయ్ చేశామా లేదా అన్న పార్టీ మూడ్‌లో కనిపిస్తారంతా. ఈ వినోదం వల్లే మార్కెట్ రాకెట్లా దూసుకుపోతుంది. దాదాపు నెల రోజుల పాటు వ్యాపారాలు కళకళలాడిపోతాయ్. ఆ మధ్య కరోనా వల్ల రెండేళ్ల పాటు బిజినెస్ డల్ అయింది కానీ ఇప్పుడు మళ్లీ ట్రాక్ ఎక్కేసింది. క్రిస్మస్,న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే గిఫ్ట్‌లు ఉండకపోతే ఎలా..? పైగా మనీ కన్నా మెమరీస్ ముఖ్యం అనుకునే Gen-Z ఇది. అందుకే ఖర్చుకి వెనకాడకుండా కుమ్మరించేస్తున్నారు. డిసెంబర్ 31 న జస్ట్ ఆ ఒక్క రాత్రి కోసం చాలా ప్లాన్లు వేసుకుంటారు. ఆ మధ్య జరిగిన ఓ సర్వేలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం మిలీనియల్స్ ఎంత ఖర్చు చేస్తారో ఓ క్లారిటీ వచ్చింది. డాలర్ల లెక్కన చూసుకుంటే ఒక్కొక్కరు కనీసం 228 డాలర్లు ఖర్చు పెట్టేస్తారట. అయితే…తక్కువలో తక్కువ కనీసం 50 డాలర్లు ఖర్చు పెడుతున్నారు మిలీయనిల్స్. దాదాపు 80% మందికి పైగా అమెరికన్లు 200 డాలర్లకుపైగా ఖర్చు పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు ప్రతిసారీ. ఈసారి ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు బాగా తగ్గించేసుకుంటున్నారు. వీళ్లలో చాలా మంది కేవలం న్యూ ఇయర్ వేడుకల కోసం ఔటింగ్ వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లైఫ్ అంతా ఇది మెమొరబుల్‌గా ఉండిపోవాలనుకుంటున్నారు. అందుకే ఆ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఇలాంటి వాళ్ల కోసం స్పెషల్ ప్యాకేజ్‌లు పెడుతున్నాయి హోటల్స్. ట్రావెలింగ్ ఏజెన్సీలకీ పండగే. “ఈ ఇయర్ ఎలాగో అలా గడిచిపోయింది. కనీసం వచ్చే ఏడాదైనా హ్యాపీగా గడిచిపోవాలని కోరుకుందాం” అనే పాజిటివ్ థింకింగ్ కూడా ఖర్చుకి వెనకాడకుండా చేస్తోంది. కేవలం న్యూ ఇయర్ అనే కాదు. ఓవరాల్‌గా వింటర్ సీజన్లో బిజినెస్ ఓ రేంజ్లో ఉంటుంది అనే కాన్సెప్ట్‌ని బాగా ఫాలో అయిపోతున్నారు. గిఫ్ట్‌లు ఇచ్చే ట్రెండ్ కొనసాగుతున్నప్పటికీ న్యూ ఇయర్ టైమ్‌లో మాత్రం దాదాపు 72% మంది ఫ్రెండ్స్తోనో, ఫ్యామిలీతోనో ట్రావెల్ చేయడానికే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. కొత్త ప్లేస్‌కి వెళ్లి అక్కడే సెలబ్రేట్ చేసుకోడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా వింటర్ సీజన్లో సెలవులు ఎక్కువగా కలిసొస్తాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని చాలా బలంగా ఫిక్స్ అయిపోయి ఈ హాలిడేస్‌ని అలా జాలీగా గడిపేస్తున్నారు. అందుకే టూరిజం రంగానికి వింటర్ సీజన్లో అంతగా డిమాండ్ పెరుగుతుంది. ఇటు ఇండియాలోనూ ఈ ట్రెండ్ బాగానే కనిపిస్తోంది. గతంతో పోల్చి చూస్తే…ఎయిర్ ట్రావెలింగ్‌కి డిమాండ్ విపరీతంగా పెరిగింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో బుకింగ్స్ భారీగా ఉన్నట్టు ఎయిర్‌లైన్స్ ప్రతినిధులే చెబుతున్నారు. అడ్వెంచరస్ ట్రిప్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇదిగో ఈ మంత్రాన్ని బాగానే జపిస్తున్నారు అంతా. ఇంత కష్టపడేది ఖర్చు పెట్టడానికి కాదా అని తెగేసి చెబుతున్నారు. అందుకే వింటర్ సీజన్ రాగానే వర్క్ నుంచి లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు.