EX Minister Jogu Ramanna: హత్యాయత్నంలో గాయపడ్డ బాధితున్ని పరామర్శించిన మాజీ మంత్రి జోగు రామన్న 

సిరా న్యూస్, ఆదిలాబాద్:

హత్యాయత్నంలో గాయపడ్డ బాధితున్ని పరామర్శించిన మాజీ మంత్రి జోగు రామన్న 

ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలో సంచలనం రేపిన హత్యాయత్నంలో గాయపడిన మావలకు చెందిన ఎంబడి వంశీ అనే యువకున్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పరామర్శించారు. మావలలో కౌన్సిలర్ రఘుపతి ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో, ఇప్పటికే దళిత సంఘాలు రఘుపతి అరెస్ట్ కు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కాగా సోమవారం మాజీ మంత్రి రామన్న స్వయంగా యువకుని ఇంటికి వెళ్లి పరామర్శించి, అతని ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. జోగు రామన్న వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రహ్లాద్, నారాయణ, నల్లా రాజేశ్వర్, సుధీర్, సంతోష్ అజీంఖాన్, మోసిన్, సృజన్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *