సిరా న్యూస్, జైనథ్
దీపాయిగూడా నగర భోజనంలో మాజీ మంత్రి జోగు రామన్న
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వేడుకలను ఘనంగా జరుపుకోవడం అభినందనీయమని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో శనివారం ఆయన పాల్గొన్నారు. ముందుగా గ్రామంలో ప్రతిష్టించిన వినాయకుడిని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించి గణ నాథుడిని కొలిచారు. అంతకుముందు గ్రామస్తులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. శ్రీ రామ మందిరంలో ప్రతిష్టించిన ఏక దంతుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి భోజనం చేసి వారితో సరదాగా ముచ్చటించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ పండగలను ఘనంగా జరుపుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను తెలియచెప్పేలా వేడుకలను నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో నూతుల మురళీ, అల్లూరి బింరెడ్డి, అల్లలు మోహన్ రెడ్డి,బద్దం పోతారెడ్డి, ఏనుగు,ఉపేందర్ రెడ్డి, లాస్మన్న, యాళ్ల లింగారెడ్డి,లోక కృష్ణ రెడ్డి , దాసరి రవీందర్ రెడ్డి, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.