సిరా న్యూస్,ఆదిలాబాద్
మున్సిపల్ ఆర్ఐ వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి
అదిలాబాద్ పట్టణానికి చెందిన పలు కుటుంబాలను మంగళవారం మాజీ మంత్రి జోగు రామన్న పరామర్శించారు. అదిలాబాద్ మున్సిపల్ ఆర్ ఐ వెంకటేష్ సోదరుడు నాగేష్ భార్య ఇటీవల మరణించగా మంగళవారం స్వీపర్ కాలనీ వారి నివాసానికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని తీవ్ర సానుభూతిని వ్యక్తం చేశారు. అలాగే తిలక్ నగర్ కాలనీలో బీఆర్ఎస్ కార్యకర్త మాధస్తు శ్రీనివాస్‌ను పరామర్శించారు. అనంతరం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటి వద్ద ఉంటూ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు. మాజీ మంత్రి వెంట రైతు సమన్వయ అధ్యక్షులు రోకండ్ల రమేష్, ఎజ్జగిరి నారాయణ, మాజీ మార్కెట్ చైర్మన్ యాసం నర్సింగరావు, కొండా గణేష్, అశోక్ స్వామి, సోదం కేశవ్, వాగ్మారె ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.