EX Minister Jogu Ramanna: ఆదిలాబాద్ జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలి : మాజీమంత్రి జోగు రామన్న

సిరాన్యూస్: ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలి : మాజీమంత్రి జోగు రామన్న

ఆదిలాబాద్ జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని మాజీమంత్రి జోగు రామన్నఅన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ఆదిలాబాద్ వివక్షకు గురవుతుంది అనడానికి కాంగ్రెస్ పాలనలో మరోసారి పునరావృతం అవుతున్నాయ‌న్నారు. ప్ర‌జ‌లు
విషజ్వరాలతో జిల్లా ప్రజానీకం ముప్పతిప్పలు పడుతుంటే కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.వందల సంఖ్యలో డెంగీ, మలేరియ కేసులు నమోదు అవుతున్నప్పటికీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సీజనల్ వ్యాధుల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నామని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి గిరిజనులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు అందించేలా కృషి చేశామని గుర్తు చేశారు. విషజ్వరాల బారిన పడి ప్రజలు అల్లాడుతుంటే ఇంచార్జ్ మంత్రి కనీసం అధికారులతో సమీక్ష నిర్వహించడం లేదని, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని మండిపడ్డారు. గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో విషజ్వరాల బారిన పడి అనేక మంది తనువు చాలించారని, తమ ప్రభుత్వ హయంలో ఆ పరిస్థితులను మార్చామని తెలిపారు. వర్షాకాలం కంటే ముందుగానే పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వార పరిసరాలను పరిశుభ్రతకు తొలి ప్రాధాన్యతను ఇచ్చి, ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్చదనం పచ్చదనం పేరిట అయిదు రోజులు కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ వాటికి నిధులు కేటాయించకపోవడం వారి చిత్తశుద్ధికి అద్దం పడుతుందన్నారు. జిల్లాలో వైద్యుల కొరత సైతం తీవ్రంగా వేధిస్తోందని, తాజాగా రిమ్స్ లో పని చేస్తున్న వైద్యులను బదిలీ చేశారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైద్యుల కొరతతో సరైన చికిత్సలు అందడం లేదన్నారు. స‌మావేశంలో రైతు సమన్వయ అధ్యక్షులు రోకండ్ల రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ లు మెట్టు ప్రహ్లాద్, యాసం నర్సింగ్ రావు, ఇజ్జగిరి నారాయణ, పట్టణ అధ్యక్షులు అజయ్, సాజితుద్దీన్. కొమ్రా రాజు సేవ్వా జగదీష్, నవాతే శ్రీనివాస్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *