EX Minister Joguramanna: రైతులను విస్మరించిన ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ : మాజీ మంత్రి జోగురామ‌న్న‌

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
రైతులను విస్మరించిన ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ : మాజీ మంత్రి జోగురామ‌న్న‌
* మాటలు మాని అభివృద్ధికి బాటు వేయండి
* సీసీఐ పరిశ్రమనుకేంద్ర ప్రభుత్వం ద్వారానే నడిపించాలి
* పాయల్ శంకర్ అనుచిత వాక్యాలను తీవ్రంగా ఖండించిన జోగురామ‌న్న‌

వర్షాలతో పంట నష్టపోయి ఎదురుచూస్తున్న రైతులకు ధైర్యాన్ని చెప్పి వారికి హామీ ఇవ్వాల్సిన సమయంలో మంత్రితో సీసీఐ నీ సందర్శించే సమయం ఇది, కాదని పంటలు నష్టపోయి ఎదురుచూస్తున్న రైతులకు హామీ ఇవ్వాల్సిన సమయాన్ని పాలయ శంకర్ వృధా చేశారు. అన్నామే తప్ప వ్యక్తిగత దూషణలు చేయలేమని జోగు రామన్న ధ్వజమెత్తారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. ప్రభుత్వ పరంగా ఉన్న సీసీ పరిశ్రమను ప్రైవేటు పెద్దలకు అప్పజెప్పే కమిషన్లు రాబట్టాలనే ఆలోచన చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. వర్షాలతో రైతులు పంటలను కోల్పోయి దీన పరిస్థితిలో ఉన్న రైతాంగానికి మంత్రి శ్రీధర్ బాబు వస్తాడని ఎదురుచూసిన . రైతాంగానికి మంత్రి శ్రీధర్ బాబు రాకతో రైతులకు ధైర్యంతో పాటు వారికి అందాల్సిన నష్టపరిహారంపై మంత్రితో స్థానిక ఎమ్మెల్యేగా చర్చించి మొదట రైతుల వద్దకు తీసుకెల్లి ఉండాల్సిందని పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ రైతులతో కలిసి ప్రభుత్వాన్ని నిడదీయకపోవడంపై మేము వ్యతిరేకించామన్నారన్నారు. స్థానిక సభ్యుడివై ఉండి రైతుల సమస్యను పక్కనపెట్టి సిసిఐ ప్రస్తావనతో మిస్ గైడ్ చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించామని స్పష్టత ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా లో 5 వేల కోట్ల రూపాయల అభివృద్ధిని చేసి..ప్రజల సౌలభ్యం కోసం ఎంత దూరమైనా వెళ్లి… ప్రశ్నించే సత్తా నాకు ఉందని స్పష్టం చూపినం. నాది అవగాహన లోపం అనే మాట్లాడటం హాస్య‌స్పదంగా ఉంద‌న్నారు.మొదటిసారి ఎమ్మెల్యేగా వచ్చిన అవకాశాన్ని అసెంబ్లీలో మాటలతో తప్ప అభివృద్ధిలో చూపించలేవని అర్థమవుతుంద‌ని, మేము మాట్లాడిన సందర్భాన్ని వక్రీకరించడం మానేసి నీవు అనుభవాన్ని పెంచుకుంటే బాగుంటదని తో హిత‌వు పలికారు.పంటలు మునిగితే మంత్రిని సీసీఐ కి ఎందుకు తీసుకెళ్లారు అని రైతుల పక్షాన మేము ప్రశ్నించాం అన్నారు…రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ భూ నిర్వాసితుల గురించి గతంలో గప్పాలు కొట్టి..నీవు నేను ఇప్పుడు అడుగుతున్న అదే రేణుక సిమెంటు భూ నిర్వాసితులతో స్థానిక ఎమ్మెల్యేగా నీవు రైతుల పక్షాన జోగు రామన్న నేను కలెక్టర్ వద్దకు వెళ్లి ఎకరానికి 40 లక్షల డిమాండ్ ని తెలుపుదామ‌న్నారు. ఈ డిమాండ్ ని ప్రతిపాదిస్తూ మాతో వచ్చే దమ్ము నీకుందా అని ప్రశ్నిస్తున్న.ఇక నీకు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాత్రమే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లభిస్తోందని,నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పనులు చేసి చూపించామని, ఏకంగా సీ.ఎం లను ప్రత్యేకంగా కలిసి అభివృద్ధికి నిధులు మంజూరు చేయించామని గుర్తు చేశారు. ఆదిలాబాద్ అభివృద్ధికి 5 వేల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించి అభివృద్ధి చేసి చూపామని.. దమ్ముంటే మాటలు మాని చేతలు చేసి చూపాలని సవాల్ విసిరారు.ప్రజాశీర్వాదంతో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు అధికారిక కార్యక్రమాల విధివిధానాల గురించి చెప్పే అవసరం లేదని తెలిపారు. ప్రజల సౌలభ్యం కోసం ఎంత దూరమైనా వెళ్లి… ప్రశ్నించే సత్తా నాకు ఉందని స్పష్టం చేశారు .పదేళ్లు బిజెపి అధిక కేంద్రంలో ఉన్న స్థానిక ఎంపీ ఉన్నప్పటికిని సీసీఐ పునరుద్ధరణ గురించి మాట్లాడని నీవు ఎప్పుడో ఫ్యాక్టరీ నీ ప్రైవేట్ ఫారం చేయాలని చూడటం వెనకాల ఉన్న ఉద్దేశం కమిషన్లు కాదా అని ప్ర‌శ్నించారు.అరచేతిలో వైకుంఠం చూపించే పాయల్ శంకర్. మాటలు మాని అభివృద్ధికి ఇకనైనా పాటు పడాలని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *