EX Minister Joguramanna: సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం : మాజీ మంత్రి జోగురామ‌న్న

సిరాన్యూస్‌,ఆదిలాబాద్‌
సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం : మాజీ మంత్రి జోగురామ‌న్న
* యాపాల్ గూడలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం

ప్రజా సమస్యలు పరి ష్కరించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని, స్ధానిక ఎమ్మెల్యే పాయల శంకర్ సమస్యను పట్టించుకోవడం లేద‌ని మాజీ మంత్రి జోగురామ‌న్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఎంపీటీసీ ల పరిధిలోగల యాపలగూడ లో బబీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈనెల 24న ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల పక్షాన చేపడుతున్న నిరసన సభ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా రైతుకు మద్దతుగా ప్రతి ఒక్కరూ కేటీఆర్ సభ విజయవంత చేయాల్సిందిగా దిశా నిర్దేశం చేశారు.అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ స్థానిక బిజెపి ఎమ్మెల్యే పాయల శంకర్ తన స్వలాభం కోసం బీజేపీ కండువా కప్పుకొని కాంగ్రెస్ నాయకులతో రెండు నాలుకల ధోరణి కి పాల్పడుతున్నారన్నారు. భారతదేశంలోనే నాణ్యత ప్రమాణాల్లో ఎంతో మెరుగైన ఆదిలాబాద్ పత్తి కొనుగోళ్లపై స్థానిక బీజేపీ నాయకులు నోరు మెదపకపోవడం పలు అనుమానాలకు తావుతీస్తుందన్నారు.. గుజరాత్ తరహాలో ఆదిలాబాద్ పత్తికి రేటు కల్పించాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో కరెంటు కొలతలు రైతు బీమా, రైతు బంధు, రుణమాఫీ, ఫసల్ బీమా రైతులకు అందించకుండా మోసం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతుంది అన్న సర్వే తో రైతుల ఖాతాల డబ్బులు జమ చేసిన విధంగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ రైతుబంధు రైతు బీమా ఎందుకు రైతులకు అందించలేకపోతుందని జోగు రామన్న ప్రశ్నించారు. 50 శాతం రైతులకు రుణమాఫీ కాలేదని రైతులు రోడ్లపైకి ఎక్కి నిరసనలు తెలియజేసినప్పటికీని సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ అందించడం పూర్తయిపోయిందంటూ ప్రధానికి లేఖ రాసి రైతుబంధుని ఎగగొట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రోకండ రమేష్, ఇజ్జగిరి నారాయణ, పెందర్ గంగయ్య, దుర్గం రాంచందర్, జయరాం, మామిళ్ళ భూమన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *