సిరాన్యూస్, ఆదిలాబాద్
కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం : మాజీ మంత్రి జోగురామన్న
* ప్రజలపై అదనపు విద్యుత్ భారం తప్పింది
* గులాబీ అధినేత చొరవతోనే ప్రజలకు విముక్తి
విద్యుత్ చార్జీలను పెంచకుండా ఇటీవల ఈఆర్‌సీకమిటీ తీసుకున్న నిర్ణయం వెనుక బీ.ఆర్.ఎస్ ప్రధాన పాత్ర పోషించిందని, దీని ద్వారా ప్రజలపై 18,500 కోట్ల అదనపు విద్యుత్ భారం తప్పిందని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పార్టీ నేతలతో కలిసి పాలాభిషేకం చేశారు. అదనపు విద్యుత్ చార్జీల గుడిబండ ప్రజలపై పడకుండా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అత్యంత కీలక పాత్ర పోషించిందని కొనియాడుతూ… నేతలు నినాదాలతో హోరెత్తించారు. ఈమేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ పది నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసే విధానాలను అవలంబించిందని అన్నారు. డిస్కం ల విజ్ఞప్తి మేరకు ప్రజలపై అదనపు విద్యుత్ చార్జీలు మోపే ప్రయత్నాలు చేసినా… బీ.ఆర్.ఎస్ ఒత్తిడితోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈఆర్‌సీకమిటీ చేపట్టిన అభిప్రాయం సేకరణలో, ఇతరత్రా సమావేశాల్లో తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించారని, ప్రజలపై అదనపు భారం వేస్తే తీవ్ర ఇబ్బందులు పడతారని వివరించినట్లు తెలిపారు. బీ.ఆర్.ఎస్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ఈఆర్‌సీ కమిటీకి అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వంలో ఉన్నా… ప్రతిపక్షం లో ఉన్నా…ప్రజల క్షేమమే ధ్యేయంగా పని చేస్తామని పునరుధ్ఘటించారు. కార్యక్రమంలో రౌతు మనోహర్,రోకండ్ల రమేష్, మాజీ మార్కెట్ చైర్మన్ లు, మెట్టు ప్రలాద్, యాసం నర్సింగ్ రావు. సేవ్వా జగదీష్,మాజీ ఎంపీపీలు ఘండ్రత్ రమేష్, మారిశెట్టి గోవర్ధన్, యూనిస్ అక్బనీ, సాజితుద్దీన్, కొముర రాజు, అప్కామ్ గంగయ్యా,పురుషోతం,పండ్ల శ్రీనివాస్, బట్టు సతీష్..తదితరులు పాల్గొన్నారు..