సిరాన్యూస్,ఓదెల
షరతుల్లేకుండా రుణమాఫీ అమలు చేయాలి : మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
* పెద్దపల్లిలో బీఆర్ఎస్ నాయకుల ధర్నా
రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నానిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులంధరికీ రూ. 2 లక్షలు రుణమాఫీ అమలు చేయాలన్నారు .లేనియెడల పెద్ద ఎత్తున రైతుల కోసం ఆందోళన కార్యక్రమలు ఉధృతం చేస్తానన్నారు. కార్యక్రమంలో రఘువీర్ సింగ్, యూత్ అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, ఉప్పు రాజ్ కుమార్, మార్కు లక్ష్మణ్, రవీందర్, లక్ష్మణ్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నటరాజ్, సల్లు, సమ్మయ్య గౌడ్, కార్తీక్, శ్రీధర్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
