సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
రవీందర్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ కొక్కిస రవీందర్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గురువారం రవీందర్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, మాదాసు చందు, వోడ్నాల శ్రీనివాస్, నిదానపురం దేవయ్య, జక్కే రవి, సారంగపాణి, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.