సిరా న్యూస్ భీమదేవరపల్లి:
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలి..
+ హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
+ భీమదేవరపల్లి లో బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిఆర్ఎస్ కార్యకర్తలంతా కృషి చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం భీమదేవరపల్లి మండల కేంద్రంలోని శ్రీ వెంకటసాయి గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చేసే తప్పుడు ప్రచారాలను దీటుగా తిప్పి కొట్టాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు, వాటి ప్రస్తుత పరిస్థితి ప్రజలకు వివరించాలని దిశా నిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాల్సిన ప్రాధాన్యతను బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు వివరించారు. కార్యకర్తల కష్ట సుఖాల్లో తోడు ఉంటానని, కార్యకర్తలు ఎవరు కూడా అదైర్యపడవద్దని బరోసానిచ్చారు.