సిరాన్యూస్, కాల్వశ్రీరాంపూర్
కొమరయ్య కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన మిట్టపల్లి కొమురయ్య ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ మంగళవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజవేణి సదయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాసాగోని కొమురయ్య, రాంచంద్రం, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.