సిరాన్యూస్, ఓదెల
వధూవరులను ఆశీర్వదించిన మాజీ జడ్పీటీసీ గంట రాముల యాదవ్
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని మారుతి ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన అనిల్ కుమార్ చారి- మౌనిక ల వివాహ రిసెప్షన్‌కు మండలం మాజీ జడ్పీటీసీ గంట రాములు యాదవ్ హాజరయ్యారు. ఈసందర్భంగా వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పోలోజు రమేష్ , మాజీ ఉపసర్పంచ్ తీర్థాల కుమార్, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.