సిరా న్యూస్,మెదక్;
రామయంపేటలో లో దొంగలు రెచ్చిపోయారు. దొంగలు వస్తున్నారు, మెడలో చెయిన్ ఉంచుకోవద్దని నమ్మించిన వ్యక్తులు బంగారు గొలుసుతో ఉడాయించిన ఘటన. నందిగామ నుంచి రామాయంపేటకు ద్విచక్ర వాహనంపై దంపతులు వస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు రామాయంపేట శివారులో దంపతులను అడ్డగించారు. బంగారు పుస్తెలతాడు మెడలో వేసుకొని వెళ్ళవద్దని, దొంగలు వస్తున్నారని నమ్మించి మెడలో నుండి బంగారు గొలుసు తీసారు. పేపర్లో చుట్టి ఇచ్చారు. చివరకు పేపరు తీసి చూసేసరికి రాళ్లు ప్రత్యక్షం అయ్యాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.