ప్రాణాలతో చెలగాటాలు..
సిరా న్యూస్,నెల్లూరు;
నెల్లూరు జిల్లా కావలి పరిసర ప్రాంతాల్లోని చెరువులలో ఎలాంటి అనుమతులకు రాత్రులు పెద్ద ఎత్తున మట్టిని తరలిస్తున్నారు. శాసనసభ్యులు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు ఏఎంసీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్ ఆధ్వర్యంలో మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. 12 సంవత్సరాల క్రితం కావలి పెద్ద చెరువులో ఎన్ని మంది విద్యార్థులు జల సమాధి అయిన ఘటన మరువకముందే అధికారం పార్టీ నేతలు చేపడుతున్న మట్టి తవ్వకాలు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. పెద్ద చెరువులో మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి ఇరువైపులా రెండు గిరిజన కాలనీలో ఉండడం సుమారు 20 అడుగుల మేర తవ్వుతున్న ఆ గుంతల వలన ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని స్థానికులు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటున్నారు. మట్టి తవ్వకాలకు ఎవరు అనుమతులు ఇస్తున్నారు.. ఎన్ని క్యూబిక్ మీటర్లుకు అనుమతులు ఇస్తున్నారు.. వారు ఎంత మేర తవ్వేస్తున్నారు అనేటటువంటి కనీస పరిశీలించేందుకు కూడా అధికారులు సాహసం చేయలేనటువంటి పరిస్థితి.. ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులు అధికార పార్టీ నేతలను ఎదిరించలేక మౌనంగా ఉండి పోతున్నారు. గత రాత్రి సిరిపురం చెరువులో మట్టి తవ్వకాలను స్థానిక ప్రజలు అడ్డుకోవడంతో అక్రమార్కులు అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి అక్రమం మట్టి తవ్వకాలపై ఉక్కు పాదం మోపాలని స్థానికులు కోరుకుంటున్నారు.