అధిక ఉత్పత్తి తోనే ఏరియా అభివృద్ధి*
మందమరి ఏరియా జిఎం మనోహర్
సిరా న్యూస్,మందమర్రి;
మందమర్రి ఏరియాకు ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు అధికారులు ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరూ అంకితభావంతో పనిచేయాలని ఏరియా జిఎం మనోహర్ తెలిపారు. సోమవారం ఏరియాలోని శాంతి కానీ దానిని సందర్శించారు. గణికి సంబంధించిన ప్లాన్లను పరిశీలించారు. రోజువారీగా సాధిస్తున్న ఉత్పత్తి లక్ష్యాలను గని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాద రహిత ఉత్పత్తి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అధికారులు ఉద్యోగులు విధిగా రక్షణ సూత్రాలు పాటిస్తూ విధులు నిర్వహించాలని కోరారు. పని స్థలాలను పక్క పర్యవేక్షణ చేయాలని ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారుల దృష్టికి ఉద్యోగులు తీసుకువెళ్లాలని చెప్పారు. విధి నిర్వహణలో తొందరపాటు చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు సమస్త మనది అనే భావనతో పని చేస్తే సత్ఫలితాలు సాధిస్తామని చెప్పారు. గనులలో ప్రమాదాల నివారణకు సంబంధించి పగడ్బందీ సాంకేతిక రక్షణ చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు. సమిష్టి కృషితో ఉద్యోగు లు అధికారులు పరస్పరం సహకరించుకుంటూ విధినిర్వహణలో ముందుకు సాగితే అభివృద్ధికి ఏలాంటి డోకా ఉండదని చెప్పారు. అనంతరం గనిలో దిగి పని స్థలాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో శాంతి కని ఏజెంట్ విజయ ప్రసాద్. గని మేనేజర్ సంజయ్ కుమార్ సి హ్న. గ్రూపు ఇంజనీర్ బసవరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.