సిరాన్యూస్, కడెం
పాండవాపూర్ వాగులో నల్ల బెల్లం ధ్వంసం : ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎండి రజాక్
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పాండవపూర్ గ్రామంలో మంగళవారంఆదిలాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ ఆదేశాల మేరకు మంగళవారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ నిర్మల్ ఎండి రజాక్ సమక్షం లో ఒక కేసు లో పట్టుబడ్డ 4998 కేజీల నల్ల బెల్లం, 3600 కేజీల పట్టిక 8 లీటర్స్ నాటుసారాయిని ధ్వంసం చేశారు. బుధవారం కడెం మండలం లోని పాండవాపూర్ వాగు లో వాటిని ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎండి రజాక్ తెలిపారు. ఇందులో నిర్మల్ ఎక్సైజ్ సీఐ,లక్ష్మణ్‌రావు , నిర్మల్ ఎక్సైజ్ ఎస్సై లు వసంత్‌రావు అభిషేకర్, సిబ్బంది పాల్గొన్నారు.