టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
సిరా న్యూస్,నందిగామ;
వైసిపి నేత దుబాయ్ కరిముల్లా పై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం వివాదానికి దారి తీసింది. గత రెండు రోజుల క్రితం మంత్రి జోగి రమేష్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే సౌమ్య పై కామెడీ మీమ్స్ సభలో వేయడం పై మాజీ ఎమ్మెల్యే సౌమ్య అభ్యంతరం వ్యక్తం చేసారు. దుబాయ్ కరిముల్లా పై కేసు నమోదు చేయాలని సౌమ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేయకుండా పోలీసులు మూడు రోజులుగా తాత్సారం చేయడం పై కరిముల్లా ఇంటికి మాజీ ఎమ్మెల్యే సౌమ్య, టీడీపీ నేతలు బయలు దేరారు. వైసిపి నేత ఇంటికి బయలు దేరిన మాజీ ఎమ్మెల్యే సౌమ్య ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో పోలీస్ స్టేషన్ ముందు మాజీ ఎమ్మెల్యే సౌమ్య,ఆచంట సునీత, టీడీపీ శ్రేణులు బైఠాయించారు.