సిరాన్యూస్, బేల
ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించండి: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్
* పొనాలలో గడపగడపకు కాంగ్రెస్ నాయకుల ప్రచారం
ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆదిలాబా జిల్లా బేల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ అన్నారు. బుదవారం బేల మండలం పొనాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి శ్రీమతి ఆత్రం సుగుణకు మద్దతుగా గడపగడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ ఆదిలాబాద్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసి మహిళకు ఎంపీ టికెట్ వచ్చిందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలో అమలు అవుతున్నవి, అని మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇవే కాకుండా రైతు రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 17,000 అతి త్వరలో ఇస్తామని, ఆగస్టు 15 వరకు ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు. ప్రశ్నించే గొంతుక పేద ఆదివాసి బిడ్డ ఆత్రం సుగుణక్కను మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు విలాస్, పాటిల్ బాపు రావు , ధడాంజే గెడం గులాబ్ అనిల్, ధోటే ప్రశాంత్ రెడ్డి, ఆశోక్ రెడ్డి, బీర్షావ్ అయ్యా తదితరులు పాల్గొన్నారు.