సిరా న్యూస్, చిగురుమామిడి:
కొరియర్ వాహనం డీకొని రైతు మృతి…
కొరియర్ వాహనం(TS24TA1674) ఢీకొని రైతు మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన మేడుదుల కొమరుమల్లు (55) అనే రైతు ఉదయం ఏడు గంటలకు తన వ్యవసాయ బావి వద్దకు పొలం పని మీద వెళ్లి తిరిగి ఎక్సెల్ బండిపైన ఇంటికి వస్తున్నాడు. ఈ కార్యక్రమంలో వెనుకనుండి అతివేగంతో వస్తున్న కొరియర్ వాహనం ఢీకొనడంతో తీవ్ర రక్త గాయాలు కాగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు బోరున విలపించారు. మృతదేహం పై పడి గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉంది. కొమురుమల్లు నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
