సిరా న్యూస్,కడెం
నిందితుడిని కఠినంగా శిక్షించాలి : రైతు నేత రాజేందర్ హపవత్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలో గిరిజన ఆదివాసీ మహిళలపై అత్యాచారం, హత్య ప్రయత్నం చేసిన మృగాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు నేత, సామాజిక ఉద్యమ కారులు రాజేందర్ హపావత్ డిమాండ్ చేశారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన మహిళ చావుబతుకుల్లో ఉండి ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసిన అధికారులు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆమెకు న్యాయం చేయాలని కోరారు.