సిరాన్యూస్,చిగురుమామిడి
పాము కాటుతో రైతు పోలవేణి శ్రీనివాస్ మృతి
వ్యవసాయ బావి వద్ద పొలానికి కరెంటు మోటారు పెట్టబోతున్న క్రమంలో పాముకాటుకు గురై రైతు మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం నవాబ్ పేట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే… నవాబ్ పేట గ్రామానికి చెందిన పోలవేణి శ్రీనివాస్ (48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రతి రోజు మాదిరిగానే మంగళవారం కూడా వ్యవసాయ వద్ద పనులు చేస్తుండగా పోలవేణి శ్రీనివాస్‌కు పాము కాటు వేసింది. వెంటనే కుటుంబ సభ్యులు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలిపాడు.మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బండి రాజేష్ తెలిపారు.