సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లపై మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ తో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష జరిపారు. నోటిఫై చేసిన ప్రతి జిన్నింగ్ మిల్లు పనిచేయాలని ఆదేశాలు ఇచ్చారు. సీసీఐ, సీఎండీ కి తేమశాతం సడలింపులపై వినతి ఇవ్వాలని అన్నారు. రైతులందరు వాట్సాప్ (8897281111) సేవలు ఉపయోగించుకుని దగ్గరలోని కొనుగోలు కేంద్రాల వద్దనే పత్తిని అమ్ముకోవాలి. వాట్సాప్ చాట్ యాప్ లో రైతుల నుండి వచ్చిన సమస్యలకు తక్షణమే చర్యలు తీసుకునేలా కలెక్టర్లకు, మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రైతులందరూ తమ పత్తిని ఆరబెట్టుకొని తేమశాతం 8 నుండి 12 మధ్యలో ఉండేటట్లు చూసుకొని జిన్నింగ్ మిల్లులలో అధిక మద్ధతు ధరకు అమ్ముకోవాలని మంత్రి సూచించారు.