సిరా న్యూస్,పిఠాపురం;
ఇన్పుట్ సబ్సిడీ నగదు రైతుల ఖాతాల్లో జమవుతున్నాయని,రైతులందరూ ఆనందాన్ని వెల్లబుచ్చుతున్నారని రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ సిట్టింగ్ ఎంపీ,వైఎస్సార్సీపీ పిఠాపురంనియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతావిశ్వనాథ్ పేర్కొన్నారు.గొల్లప్రోలు మండలం మల్లవరంలో వంగా గీతావిశ్వనాథ్ పర్యటించారు.ఈ సందర్భంగా విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీల నగదు ఖాతాల్లో పడడంతో రైతులు,ప్రజలు తమ ఆనందాన్ని వంగా గీతావిశ్వనాధుతో పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో అరిగెల మణిబాబు,కొత్తెం దత్తుడు,రావుల మాధవరావు తదితరులు పాల్గొన్నారు..
=====