Fast food centers: పుట్టగొడుగుల్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
పుట్టగొడుగుల్లా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు
* శుభ్రత పాటించని నిర్వాహకులు
* అధికారుల తనిఖీలు శూన్యం
* రుచి కోసం రసాయనాల వినియోగం
* ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేది ఎవరు.?

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బిర్యానీ పాయింట్ లు, హోటల్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్ల, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. సదరు నిర్వాహకులు ఆహార భద్రత నియమకాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడుతున్నారు. భద్రత నియంత్రణ అధికారుల పర్యవేక్షణ కరువవడంతో నిర్వాహకులదే ఇష్టారాజ్యం నడుస్తుంది. ఉదయం టిఫిన్ లతో మొదలవుతున్న వీరి దందాలు అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది, ఆహార భద్రత నియమాలు పాటించకున్న అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో సత్వర విమర్శలు బిల్లు వెత్తుతున్నాయి. నిర్వాహకులు చాలావరకు కొందరు నాయకుల అండదండలతో కొనసాగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. నెలవారీగా వారు మామూలు తీసుకోవడంతో అధికారులు వీటిపై దృష్టి సాధించడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు.
అధికారుల తనిఖీలు శూన్యం…
ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఇప్పుడు ఇన్స్పెక్టర్లు పట్టించుకోవడంలేదని తనిఖీలు నిర్వహించడం లేదని ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని విమర్శలు కనబడుతున్నాయి. ఖానాపూర్ పట్టణానికి వివిధ ప్రాంతాల నుండి రాకపోకలు జరుగుతుంటాయి ఇదే అదునుగా విచ్చలవిడిగా టిఫిన్ సెంటర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ హోటల్లు రెస్టారెంట్లు ఓపెన్ చేసి కాసుల వేటలో నిమగ్నమై ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నకిలీ నకిలీ ఆయిల్ని నాసిరకం పిండి ప్రజలకు ఇప్పటినుండి స్టోర్ చేసిన చికెన్ మటన్ ఫిష్ వేడివేడిగా వడ్డించి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టణంలో నిర్వహించబడుతున్న హోటల్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు రెస్టారెంట్ల కు మున్సిపాలిటీ నుండి ఎటువంటి అనుమతులు లేవు అని చర్చ జరుగుతుంది.
రుచి కోసం భయంకరమైన రసాయనాలు వినియోగం…
అనుమతులు తీసుకోకుండా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వ్యాపారాలు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ నిర్వాహకులు దర్జాగా ఫుల్ బిజినెస్ లో లాభాలు గడిస్తున్నారు. ఇక స్థానిక లీడర్ల అండదండలు ఉంటే ఇక ఆపే వాళ్ళు ఎవరు ఉంటారు వేడివేడిగా ఫాస్ట్ ఫుడ్ భోజన ప్రియులకు అందిస్తున్నారు కానీ వీటిలో చాలావరకు అడ్డగోలుగా రసాయన పదార్థాలను వాడుతూ ముఖ్యంగా టేస్టీకి స్పైసీ కి స్మిల్ కి హానికరమైన రసాయనాలను వాడుతున్నారు ఇవేమీ ఎప్పుడు ఇన్స్పెక్టర్లు పట్టించుకోకపోవడంతో తనిఖీలు నిర్వహించకపోవడంతో ఈ వ్యాపారాలు మూడు పూవులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. కొన్ని హోటళ్లలో పంట గదులను చూస్తే అపరిశుభ్రమైన వాతావరణం, ఈగలు బోధింకలతో దుర్వాసన వస్తున్నప్పటికీ ఫుడ్ సెక్యూరిటీ అధికారులు వాటి వంకయినా చూడటం లేదు. దానితో కొంతమంది కలుషిత ఆహారం తీసుకుని అనారోగ్యం పాలై ఆసుపత్రులలో చేరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నియోజకవర్గంలోని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నడిపే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు హోటల్లు టిఫిన్ సెంటర్లు రెస్టారెంట్లపై చర్యలు తీసుకుని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలు కోరుతూ సాధ్యమైనంత వరకు వేట ఆహారం అలవాట్లు తీసుకోవద్దని ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *