సిరా న్యూస్,హన్మకొండ;
హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట శివారులో శుక్రవారం తెల్లవారుజామున లారీ కారును ఢీకొన్న ప్రమాదం లో కారులోని నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు ఏటూరు నాగారంకు చెందిన వారీగా గుర్తించారు. మంతెన కాంతయ్య (72), మంతెన శంకర్ (60), మంతెన భరత్ (29)మంతెన చందన ( 16) అక్కడికక్కడే మృతి చెందారు.మృతదేహాలను ఎంజిఎం మార్చురీకి తరలించారు.
మంతెన రేణుక (60), మంతెన భార్గవ్ (30), మంతెన శ్రీదేవి (50) లకు గాయాలయ్యాయి. వారికి ఎంజిఎం లో చికిత్స అందిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా వేములు వాడ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది.