సిరా న్యూస్,బీలాస్ పూర్;
ఝార్ఖండ్ – చక్రధర్పూర్ డివిజన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలును హౌరా – ముంబై రైలు ఢీకొట్టింది. చక్రధర్పూర్ వద్ద పొద్దున 3.45 గంటలకు గూడ్స్ రైలు బోగిలు పట్టాలు తప్పి పక్క ట్రాక్ పై పడ్డాయి. అదే లైన్లో వచ్చిన హౌరా – ముంబై రైలు ట్రాక్ పై పడ్డ గూడ్స్ రైలు భోగిలను ఢీకొట్టింది. ప్రమాదధాటికి 18 బోగిలు చెల్లాచెదురయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ 20 మంది ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు. ఘటనలో ఒకరు మృతి చెందారని సమాచారం.