సిరా న్యూస్,సంగారెడ్డి;
సంగారెడ్డి జిల్లా శివంపేట్ బీర్ ఫ్యాక్టరీ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు టేక్మాల్ మండలం మల్కాపూర్ గ్రామం లాకావత్ శ్రీను (32), అల్లాదుర్గం మండలం ముప్పారం తండాకు చెందిన నేనవత్ అశోక్ (28) గా గుర్తించారు. ఇద్దరు బావ బావమారుదులు సంగారెడ్డి లో అడ్డ లేబర్ పని కోసం వెళ్తుండగా ఘటన జరిగింది.
============