సిరా న్యూస్,హైదరాబాద్;
డీఆర్దీవో మిస్సైల్ సైంటిస్ట్ రామ్ నరైన్ అగర్వాల్ (84)హైదరాబాద్ లో కన్ను మూశారు. వయో సంబంధిత సమస్యలతో పోరాడుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. రాజస్థాన్లోని జైపుర్లో జన్మించిన ఆయన 1983 లో లాంచ్ అయిన అగ్ని ప్రోగ్రామ్లో విశేష సేవలు అందించారు. ‘అగ్ని మిస్సైల్స్’కు తొలి ప్రోగ్రామ్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన్ను ఫాదర్ ఆఫ్ అగ్ని మిస్సైల్స్ గా పిలుస్తారు. 1990లో పద్మశ్రీ, 2000 లో పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు.