సిరాన్యూస్, ఓదెల
ఓదెలలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
ఓదెల మండల కేంద్రంలో శుక్రవారం ఓదెల తెలంగాణ గ్రామీణ బ్యాంకు వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత డిజిటల్ బ్యాంకింగ్ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎఫ్ డి ఎల్ సి ప్రోగ్రాం ఆఫీసర్ బి. శ్రీనివాస్ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ సేవలో ఆధార్, ఓటీపీ ఎవరికి చెప్పరాదని ఆయన అన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు ఉన్న వారికి ప్రమాద బీమా కింద రెండు లక్షలు ఇవ్వనున్నారు. జీవనజ్యోతి బీమా యోజన 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు ఉన్నవారికి సంవత్సరానికి గాను 430 రూపాయలు చెల్లించినట్లయితే జీవిత బీమా 2 లక్షలు వర్తింపజేస్తుందని అన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ ప్రమాద బీమా 18 సంవత్సరాల నుండి 65సంవత్సరాల వారికి సంవత్సరానికి ₹1000 చెల్లించినట్లయితే ప్రమాద బీమా కింద 20 లక్షలు బీమా వర్తింప చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఓదెల తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఆర్ .సురేందర్, ఐదు మహిళా సంఘ గ్రూపులు సీఏ లు మాటేటి పద్మ, నూతి ప్రణీత, మంద అనిత, పిట్టల రమ, భూసారపు లావణ్య, 40 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.