ఎన్ కౌంటర్లతో ఏజెన్సీలో భయం.. భయం…

సిరా న్యూస్,వరంగల్;
తెలంగాణ – ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు ములుగు జిల్లా ఏజెన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు పార్టీ మందు పాతరలు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే మందుపాతర పేలి ఓ వ్యక్తి చనిపోగా.. వరుసగా మావోయిస్టుల మందుపాతరలు పోలీసులు వెలికితీసి నిర్వీర్యం చేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఎక్కడ.. ఎప్పుడు ఇలాంటి పేలుడు వార్త వినాల్సివస్తుందో.. ఆ బాంబులు ఎవరిని బలి తీసుకుంటాయో అని హడలెత్తిపోతున్నారు. పోలీసులు – మావోయిస్టుల మధ్య ఆధిపత్య పోరులో సామాన్యులు నలిగి పోతున్నారు. మావోయిస్టుల ఉనికే లేకుండా చేయడం కోసం పోలీసులు అస్త్రశస్త్రాలతో అడవులను జల్లెడ పడుతున్నారు. మరోవైపు పోలీసులను మట్టు పెట్టడం కోసం మావోయిస్టులు అమర్చిన బూజిట్రాప్స్ ఇప్పుడు జనం గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.ములుగు జిల్లా ఏజెన్సీలోని వాజేడు, వెంకటాపురం మండలాల్లో క్షణక్షణం టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఈనెల 3వ తేదీన కొంగాల గుట్టపై మావోయిస్టులు అమర్చిన ట్రాప్ బుజీ పేలి యేసు అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత మావోయిస్టులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇప్పటికి గ్రామాల్లో నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి . మరోవైపు మావోయిస్టులు కూడా మందు పాతర పేలుళ్లపై లేఖవిడుదల చేశారు. తమ డెన్నులను కనిపెట్టడం కోసం ఇన్ ఫార్మర్లను అడవిలోకి పంపి పోలీసులే వారి చావుకు కారణం అవుతున్నారని మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. మందుపాతర పేలు చనిపోయిన ఏసు కూడా పోలీసుల డైరెక్షన్లోనే అడవిలోకి వచ్చి మందు పాతరలకు బలయ్యడని లేఖ విడుదల చేశారు. అంతేకాదు ఈ ప్రాంతంలో చాలా మందు పాతరలు ఉన్నాయని మా ఆత్మరక్షణ కోసం మందుపాతరలు అమర్చామని మావోయిస్టులు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మందు పాతరలు ఏజెన్సీ ప్రజలు ఆడలెత్తిపోయేలా చేస్తున్నాయి. ఎప్పుడు.. ఎక్కడ ఇలాంటి పేలుడు వార్త వినాల్సి వస్తుందో..! ఆ పేలుళ్లు ఎవరిని బలి తీసుకుంటాయో అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అయితే మందు పాతరలను నిర్వీర్యం చేయడం కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇటు రహదారుల వెంట అమర్చిన మందు పాతరలతో పాటు అడవుల్లో అమర్చిన మందు పాతరాలను కూడా వరుసగా నిర్వీర్యం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం జగన్నాధపురం గ్రామ సమీపంలోని చలిమెల అడవుల్లో ఒక ల్యాండ్ మైన్ నిర్వీర్యం చేశారు. తాజాగా జగన్నాథపురం గ్రామ శివారులో రహదారి పక్కనే మరో మందుపాతర గుర్తించి నిర్వీర్యం చేశారు. ఆ ప్రాంతమంతా బాంబ్ డిస్పోస్ స్క్వాడ్ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచిస్తున్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో అమాయక ప్రజల ప్రాణాలకు ముప్పు తేవద్దని హెచ్చరిస్తున్నారు.
================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *