సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖ జిల్లాలో ఓ అవినీతి పోలీసు అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. మల్కా పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదు చేసిన మోసం కేసులో నిందితులను రిమాండుకు పంపిం చకుండా ఉండేందుకు మల్కాపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న కె దేముడమ్మ ఫిర్యాదుదారు నుంచి డబ్బులు డిమాండ్ చేసిన నేపథ్యంలో బాధితుల ఫిర్యాదు మేరకు ఎసిబి డిఎస్పీలు నాగేశ్వరరావు రమ్య ల ఆధ్వర్యంలో అధికారులు బాధితుల నుంచి లంచం డబ్బులు తీసుకుం టుండగా ఎస్ఐ కె దేముడమ్మను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డిఎస్పీ రమ్య తెలిపిన వివరాల ప్రకారం కేసులో బాధితుల నుంచి ముప్పైవేలు రూపాయాలు డిమాం డ్ చేసి అందులో భాగంగా పదివేల రూపాయలను తీసుకుం టుండగా అధికారులు ఆకస్మిక దాడి చేసి పట్టుకున్నారు. సుమారు రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ వద్ద కాపు కాసిన అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం నగరం లో సంచలనం రేపింది.