వ్యవసాయ అధికారి,నాగార్జున రెడ్డి
సిరా న్యూస్,నాగర్ కర్నూల్;
వ్యవసాయ శాఖ-లింగాల రైతు వేదికలో నేడు ప్రపంచ నేల ఆరోగ్య దినోత్సవం లో భాగంగా రైతులకు భూసారం, భూసార పరీక్షల ఆవశ్యకత పై అవగాహన వ్యవసాయ అధికారి,నాగార్జున రెడ్డి కల్పించడమైనది.
భూసంరక్షణపై దృష్టి:
ఏటా జనాభా పెరుగుతోంది. ఈ క్రమంలోనే పారిశ్రామిక రంగం, నాగరికత, నగరీకరణ పెరుగుతోంది. కానీ అదే నిష్పత్తిలో నేల పెరగడం లేదు. దేశంలో 70 శాతం మంది ప్రజలు నేలను నమ్మకునే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో జనాభా అవసరాలకు అనుగుణంగా పంట ఉత్పత్తులను పెంచే క్రమంలో విచ్ఛలవిడిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల నేల ఆరోగ్యం క్షీణిస్తోంది. పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని పంటలు పండడం కష్టమైంది. పెట్టుబడులు పెరిగి రైతులు నష్టాల పాలవుతున్నారు. ప్రజారోగ్యానికీ విఘాతం కలుగుతోంది. దీంతో భూ సంరక్షణ చర్యలు అనివార్యమయ్యాయి.
భూసార పరీక్షల ద్వారా సమతుల్యత
భూసంరక్షణలో భాగంగా ప్రతి రైతూ కనీసం మూడేళ్లకోసారి మట్టి పరీక్షలు చేయించుకోవాలి.
ప్రకృతి వరప్రసాదమైన నేలలో సహజంగానే కొన్ని పోషకాలు ఉంటాయన్నారు. ఇటీవల నేల ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉండడంతో భూసార పరీక్షల ద్వారా నేలలో ఉండే పోషకాలు తెలుసుకుని… అవసరమైన పోషకాలు సమపాళ్లలో అందించాలని సూచిస్తున్నారు. దీని వల్ల భూసారం పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయన్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని గణనీయంగా తగ్గించి వాటి స్థానంలో వర్మీకంపోస్టు, పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు, పందుల ఎరువు లాంటి సేంద్రియ పోషకాలు వినియోగించడం అత్యంత శ్రేయస్కరమని సూచించారు. భూసంరక్షణ చర్యలు చేపట్టి భావి తరాలకు బంగారు భూమిని బహుమతిగా అందించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి.
ఈ కార్యక్రమంలో ఏ ఈఓ సురేంద్ర రెడ్డి. రైతులు తదితరులు పాల్గొన్నారు.