సిరా న్యూస్, భీమదేవరపల్లి
ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్ కుటుంబాన్నిపరామర్శించిన దళిత సంఘం నాయకులు
భీమదేవరపల్లి మండల్ కొప్పురు గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రేణికుంట్ల బిక్షపతి తమ్ముడు రేణుకుంట్ల శ్రీనివాస్ గత వారం క్రితం మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న అంబేద్కర్ సంఘ నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు బాధిత కుటుంబాన్ని శనివారం పరామర్శించారు.ఈ సందర్బంగా రేణుకుంట్ల శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పిం చారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో అంబేద్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్పాలా ప్రకాష్, ఎమ్మార్పీఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి మాట్ల వెంకటస్వామి మాదిగ ,అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కండే సుధాకర్, రాష్ట్ర బీసీ సంఘం నాయకులు వేముల జగదీష్, అంబాల చక్రపాణి, కొమ్ముల రవీందర్, బైరి, సదానందం తదితరులు పాల్గొన్నారు.