సిరా న్యూస్,ఖమ్మం;
వైరాలోని వాసవి కళ్యాణ మండపంలో వైరా మండల ఆర్యవైశ్య అధ్యక్షుని ఎన్నికకు నామినేషన్లు పోటాపోటీగా దాఖలు చేశారు.సాధారణ ఎన్నికల మరిపించే విధంగా నామినేషన్ను వేసేందుకు ఆర్యవైశ్యులు మొగ్గు చూపారు. ఎన్నికల అధికారులుగా చారుగుండ్ల వెంకటలక్ష్మి, నరసింహారావు, మహంకాళి శ్రీనివాసరావు, వంగవీటి రాజశేఖర్ ఉండగా ఎన్నికల పరిశీలకులుగా వనమా విశ్వేశ్వరరావు, నూకల వాసు,వనమా కిరణ్ అన్నారు. వచ్చేనెల ఒకటో తారీఖున జరిగే వైరా మండల ఆర్యవైశ్య అధ్యక్షుని ఎన్నిక ఏకగ్రీవం కాకపోవడంతో జిల్లా ఆర్యవైశ్య మహాసభ పరిశీలకులు ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు.ఇక పోటాపోటీగా పోటీలో నిలబడటంతో ఆర్యవైశ్య సంఘం నాయకులు ఎన్నికలకు వెళ్లి ప్రజాస్వామ్యంలో గెలిపించుకోవాలని తీర్మానించడంతో వచ్చేనెల లో ఒకటవ తారీకు ఎన్నికలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఇందులో భాగంగా ఎన్నికలకు అధ్యక్ష పదవికి మిట్టపల్లి రాఘవరావు,మిట్టపల్లి కిరణ్ లు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థులకు ఓటు వేసే విధానాన్ని ఆర్యవైశ్య కుటుంబ సభ్యులకు అవగాహనను ఏర్పాటు చేసేందుకు అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఒకరిపై మరొకరు పై చేయి సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.