యూనివర్శిటీ వీసీ దరఖాస్తుల వడపోత

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల వైస్ చాన్సలర్ల పదవీకాలం ముగియనుండటంతో కొత్త వీసీ నియామకం ప్రక్రియ జోరుగా కొనసాగుతుంది. తెలంగాణలోని యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీచేసింది. పది యూనివర్సిటీలకు సంబంధించి వీసీ పోస్టుల కోసం హైయర్ ఎడ్యూకేషన్ కౌన్సిల్ దరఖాస్తులు స్వీకరించింది. దీంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వెల్లువెత్తాయి.ఉస్మానియా యూనివర్సిటీ,పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది ఉన్నతవిద్యా మండలి. అలాగే, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీల వీసీల పోస్టులకు దరఖాస్తులుస్వీకరించింది.
జనవర 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు అప్లికేషన్లు తీసుకోగా పది విశ్వవిద్యాలయాలకు గానూ 1,382 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల్లో కొంతమంది ఒక్క యునివర్సిటీ వీసీ కాకుండా , ఏదో ఒక
యూనివర్సిటీకి రాకపోతుందా అని, రెండు అంతకుమించి వర్సిటీ వీసీ పోస్టుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటికి 208 అప్లికేషన్లు రాగా, కనిష్టంగా
జేఎన్ఏఎఫ్ఏయూకు 51 దరఖాస్తులు వచ్చాయి.

యూనివర్సిటీల వారీగా వచ్చిన అప్లికేషన్లు:
ఉస్మానియా యూనివర్సిటీ: 193
పాలమూరు యూనివర్సిటీ: 159
మహాత్మాగాంధీ యూనివర్సిటీ: 157
శాతవాహన యూనివర్సిటీ: 158
తెలంగాణ యూనివర్సిటీ : 135
పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ: 66
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ: 208
జేఎన్‌టీయూ-హైదరాబాద్: 106
జేఎన్ఏఎఫ్ఏయూ: 51
వీసీ దరఖాస్తుల స్వీకరణ ముగియడంతో వాటి స్క్రూటిని ప్రక్రియను ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది. వీటిని వడపోసి ప్రభుత్వానికి నివేదించనుంది. దీనికి అనుగుణంగా వైస్ చాన్సలర్ సెర్చ్ కమిటీ ఏర్పాటుప్రక్రియను కూడా ప్రారంభించారు. విశ్వవిద్యాలయాల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీల సమావేశాలు జరిపి, నామినీల నియామకం పూర్తి చేస్తారు. UGC నామీనిల కోసం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం లేఖరాశారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి నామినిల జాబితా రాగానే ముగ్గురు సభ్యులతో యునివర్సిటీకి ఒక సెర్చ కమిటీ నియమిస్తారు. ఆ తర్వాత వీసీ పోస్టుల కోసం వచ్చి దరఖాస్తుల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియస్టార్ట్ అవుతుంది. వైస్ చాన్సలర్లను నియామకాన్ని వేగవంతంగా పూర్తి చేసి విశ్వవిద్యాలయాల్లోని సమస్యలకు చెక్ పెట్టాలని సర్కార్ భావిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *