జన్మనిచ్చిన నంద్యాల ప్రజలకు సేవాకార్యక్రమాలు చేస్తా.
పేదలకు సేవచేయడమే లక్షం.
యువ రాజకీయ,ఆర్య వైశ్య నాయకులు గోళ్ల రాజేష్.
సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల పట్టణం లోని వికలాంగులకు చేతి కర్రలకు ఆర్థిక సహాయం అందించినట్లు యువ రాజకీయ ,ఆర్య వైశ్య నాయకులు గోళ్ల రాజేష్ పేర్కొన్నారు.బాలాజీ కాంప్లెక్స్ లోని వికలాంగుల సేవా సంఘం కార్యాలయంలో ఆదివారం సంఘం అధ్యక్షులు సుబ్బారెడ్డి, రమనయ్య లకు 20 వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ జన్మనిచ్చిన నంద్యాల ప్రజలకు సేవాచేయాలని పేర్కొన్నారు.వికలాంగులు కొందరు చేతి కర్రలు లేకుండా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకొని 20 వేలు సహాయం చేశానని పేర్కొన్నారు.ముందు,ముందు పేద ప్రజలకు కుల మతాలకు అతీతంగా సేవలు చేస్తానని పేర్కొన్నారు.నంద్యాల ప్రజల ఆశీర్వాదాలు కావాలని కోరారు.