నిరుపేదలైన అక్కా చెల్లెళ్లకు రూ.40వేల ఆర్థిక సహాయం

-ఆర్థిక సహాయం అందించిన పోతరవేని క్రాంతి ని అభినందించిన పలువురు
సిరా న్యూస్,మంథని;
మంథని మున్సిపల్ పరిధిలోని బోయిన్ పేట్ కి చెందిన నిరుపేదలైన కుంట సమ్మక్క, సందీప అనే అక్కచెల్లెళ్ళు చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి చిన్న గూన ఇంటిలో నివసిస్తున్నారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గాను వారి ఇల్లు పూర్తిగా నేలమట్టం అయ్యి నిరాశ్రులయ్యారు. అదే వీధిలో నివాసం ఉంటున్న మంథని మత్స్యపారిశ్రామిక సంఘం అధ్యక్షులు, పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి వారి దుస్థితిని చూసి చలించి పోయారు. క్రాంతి తన స్నేహితులకు ఫోను ద్వారా వీరి దుస్థితిని తెలియజేసి మిత్రుల సహాయం తో 40 వేల రూపాయలను సేకరించాడు. సోమవారం నిరుపేదలైన కుంట సమ్మక్క, సందీప అక్కచెల్లెళ్ళకు 40 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తల్లితండ్రులు లేని ఈ నిరుపేద ఆడబిడ్డలను ప్రభుత్వం వెంటనే ఆదుకొని వారికి పక్క ఇల్లు ను నిర్మించి ఇవ్వాలని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును,సంబంధిత అధికారులను బోయిన్ పేట్ గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. తన మిత్రుల ద్వారా 40 వేల రూపాయలు సేకరించి నిరుపేద అక్కా చెల్లెళ్లకు ఆర్థిక సహాయం అందించిన పోతరవేని క్రాంతి ని బోయిని పేట ప్రజలతో పాటు పలువురు అభినందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *