సిరా న్యూస్,రామడుగు;
రామడుగు మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన దైవాల పరుశురాములు గౌడ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారికి ఇద్దరు కూతుర్లు తల్లి ఎనిమిది సంవత్సరాల క్రితం మరణించింది. ఇద్దరు ఆడపిల్లలు తల్లిదండ్రులు లేక అనాధలైనారు సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న వెంటనే గోపాల్ రావు పేట నేచర్ యూత్ క్లబ్ వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో 27011 రూపాయలతో పాటు 25 కిలోల బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే మానవత దృకృతంతో ఆర్థిక సహాయం అందించాలని గోపాల్ రావు పేట నేచర్ యూత్ క్లబ్ యాజమాన్యంవిజ్ఞప్తి చేశారు.(9849262491) నెంబర్ కు గూగుల్ పే ఫోన్ పే చేయగలరు. ఈ కార్యక్రమంలో నేచర్ యూత్ క్లబ్ అధ్యక్షుడు కాసారపు పరుశురాం గౌడ్ ప్రధాన కార్యదర్శి బుర్ర శ్రీకాంత్ గౌడ్ ఉపాధ్యక్షులు ఫైండ్ల శ్రీనివాస్ గడ్డం రత్నాకర్ ప్రచార కార్యదర్శి దాసరి రవి శాస్త్రి నేరెళ్ల అజయ్ గాజరవేణి మహేష్ కసారపు రాజు దాసరి అనిల్ గుంటి రాజు వెంకట్రావుపల్లి మాజీ సర్పంచ్ జవాజి శేఖర్ న్యాయవాది కత్తి మధు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.