సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ పట్టణంలోని కస్బా ఉన్నత పాఠశాలలో 13 ఏళ్ల శ్రీరామ్ అనే విద్యార్థి గుండెజబ్బుతో బాధపడుతున్నాడు. ఇతనికి ఇటీవల డైస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో గుండెకు హైదరాబాదులోని కేర్ హాస్పిటల్ చికిత్స చేయాల్సి ఉందని వైద్యులు సూచన చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన బాలుడు తండ్రి హైదరాబాద్ వెళ్లడానికి రవాణా చార్జీలు లేక వెల్లలేకపోతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ చైర్మన్ కడారి నరేష్ 5000 రూపాయలు సమకూర్చారు. ఈ డబ్బును సోమవారం జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ , ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, డైస్ కౌన్సిలర్ రామచందర్ అందజేశారు.