సిరా న్యూస్, లోకేశ్వరం
ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం
* రెండు లక్షల రూపాయలు నగదు బూడిద
లోకేశ్వరం మండలంలోని వట్టోలి గ్రామానికి చెందిన ఎగ్జామ్ భూమన్న ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధమైంది.ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సుమారు 1గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక యంత్రం సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పేసింది. ఈ ప్రమాదంలో దాదాపు రెండు లక్షల రూపాయలు నగదు, సామాగ్రి కాలిబూడిందైంది.