సిరా న్యూస్,నల్గోండ;
నల్లగొండ జిల్లా కేంద్రంలోని పాత జిల్లా పరిషత్ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆడిటింగ్ సెక్షన్ లో అతి ముఖ్యమైన ఫైళ్లు అన్ని అగ్నికి ఆహుతి అయ్యాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంపై సర్వత్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా పరిషత్ నుంచి చేపట్టిన వందల కోట్ల రూపాయల పనులకు సంబంధించి.. ఆడిటింగ్ జరుగుతుంటుంది. ఈ ప్రమాదం వెనక ఎవరి హస్తమైన ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.