సిరా న్యూస్,హైదరాబాద్;
ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్పేట ద్వారకామయి నగర్ లో మెయిన్ రోడ్డు వద్ద కరెంటు స్తంభాలకు ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్నిప్రమాద చోటుచేసుకుంది.. ద్వారక మెయిన్ రోడ్డు ఉన్న కరెంటు స్తంభాలకు వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతోనే అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. స్థానికులు గమనించి విద్యుత్ అధికారులకు తెలియజేయడంతో సుమారుగా రెండు గంటల పాటు కరెంటు నిలిచిపోయింది. స్థానిక ప్రజలు గమనించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు
===================