సిరాన్యూస్, చిగురుమామిడి
బొమ్మనపల్లిలో అగ్ని ప్రమాదం
* గడ్డి వాము దగ్ధం… లేగదూడ మృతి
* ప్రభుత్వం ఆదుకోవాలన్న బాధితులు
అగ్నిప్రమాదంలో గడ్డివాము , లేగ దూడ మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపెళ్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. బొమ్మనపల్లి గ్రామానికి కత్తుల ఎల్లయ్య, లచ్చవ్వ దేవేందర్ అనే రైతులు తెలిపిన వివరాల ప్రకారం… కత్తుల ఎల్లయ్య వ్యవసాయ బావి వద్ద శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో 20కేవీపీ ట్రాన్స్ఫార్మర్ యొక్క లక్సులు కొట్టేయడంతో మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించారు. మంటలు చెలరేడం చూసి కత్తుల దేవేందర్ అనే రైతు వ్యవసాయ బావి వద్ద చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశాడు. అప్పటికే లేగ దూడ మంటల్లో కాలి మృతి చెందింది. దొడ్డిలో ఉన్న మిగతా రెండు ఆవుల, ఒక లేగదూడల తాళ్లు విప్పి దూరంగా పంపించడంతో ప్రమాదం తప్పింది. అయినా 15 ట్రిప్పుల పెంట దగ్ధం కాగా, కత్తుల దేవేందర్ అనే రైతుకు చెందిన 300వందల గడ్డి కట్టలు దగ్ధమయ్యాయి. దీంతో బాధితులు బోరున విలపించారు. ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తులు చేయకపోవడం వల్లనే అగ్ని ప్రమాదం జరిగిందని రైతులు ఆరోపించారు. గత రెండు నెలల నుంచి మరమ్మతులు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు చెప్పిన పట్టించుకోలేదన్నారు. సుమారు రూ. 50,000 వరకు నష్టం జరిగిందని తెలిపారు.బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాచమల్ల రమణయ్య డిమాండ్ చేశారు.