-గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు
-పట్టణంలోని పలు ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు
సిరా న్యూస్,మంథని;
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంథని పట్టణ శివారులోని గోదావరినదిలో భక్తులు బుధవారం పుణ్య స్నానాలు ఆచరించరించారు. ఏకాదశి రోజున గోదావరి స్నానాలు ఆచరించిన వారికి పాపాలు తొలగి పుణ్యం లభిస్తోందని భక్తుల నమ్మకం. మంథని పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరికి దారి పొడవునా భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు.
పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గోదావరి నది తీరంలోని శ్రీరామలింగేశ్వర, శ్రీ పంచబ్రహ్మేశ్వర, శ్రీహనుమాన్, శ్రీగౌతమేశ్వర స్వామి, శ్రీసీతారామ, శ్రీసరస్వతీ దేవి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నది తీరంలోని శ్రీగౌతమేశ్వరస్వామి ఆలయంలో మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమా సురేష్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచలోహ త్రిముఖ-నాగపడిగెను అలంకరించారు. . గోదావరి నదిలో స్నానమాచరించిన భక్తులు పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నదితీరంలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను మున్సిపల్ చైర్‌పర్సన్ రమా సురేష్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, కౌన్సిలర్ వీకే రవిలు పరిశీలించారు. చినుకులు పడుతున్న లెక్కచేయకుండా వేకువ జాము నుండే భక్తులు వేల సంఖ్యలో గోదావరికి తరలి రావడంతో మంథని పోలీసులు బారి బందోబస్తు చేపట్టారు