సిరా న్యూస్,జగ్గంపేట;
రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళుతున్న చేపల రోడ్డు లారీ ప్రమాదానికి గురైంది. మార్గమధ్యలోని గండేపల్లి మండలం జెడ్ రాగంపేట జాతీయ రహదారి మీదుగా వెళుతున్న సమయంలో ఒక్కసారిగా లోడు పక్కకు వరగడంతో లారీ రోడ్డు నుంచి క్రిందకు దిగిపోయింది. దీంతో చేపల లోడుతో ఉన్న ఐస్ బాక్సులు అన్ని ముందుకు వచ్చి క్యాబిన్ పై పడటంతో డ్రైవర్ క్లీనర్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు అచ్చిరెడ్డి రాంబాబు, రేపల్లె గంగాధరరావు గా పోలీసులు గుర్తించారు…….